JSON Variables

ఎఐటియుసి ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష

ఎఐటియుసి ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష
న్యూస్ పవర్ రిపోట్టర్ సాయిరాం


బెల్లంపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్ లో అన్ని రకాల స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించి, పూర్వవైభవం తీసుకురావాలని,(బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ పరిరక్షణకై  )
 సింగరేణి ఏరియా హాస్పిటల్ లో కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఎఐటియుసి ఆధ్వర్యంలో ఏరియా ఆస్పత్రి ఆవరణలో సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. 
దీక్షను ఎఐటియుసి కేంద్ర ఉఫాధ్యక్షుడు మిట్టపెల్లి వెంకటస్వామి, ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్  ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రిని రోగులకు సరిపడు వైద్యం అందించే సదుద్దేశంతో కాంట్రాక్ట్ కార్మికులకు టెండర్లు ద్వారా నియమించాలి. గత మూడు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న వారిని రాజకీయ జోక్యం వలన టెండర్లు అమలు చేసే విషయంలో జాప్యం చేయడం జరిగిందని. తక్షణమే ఆ టెండర్లను పునఃప్రారంభించి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 సింగరేణి లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని, గత నాలుగు సంవత్సరాల నుండి రావలసిన CMPF చిట్టి లతో పాటు వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు.
రోగుల ప్రాణాలను కాపాడే అత్యవసర సిబ్బంది అయినా వైద్య సిబ్బంది లకు ప్లేడే, పిహెచ్ డి కొతలను హెచ్ వేసి పూర్తి స్థాయిలో ప్లేడే, పిహెచ్ డి లను ఇవ్వాలన్నారు. బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి 10 వేల మంది కార్మికులకు వారి కార్మిక కుటుంబాలకు సరిపడా వైద్యం అందించే విధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలన్నారు.. సింగరేణి ఏరియా హాస్పటల్ కు సరిపడు వైద్య సిబ్బంది లను, స్టాఫ్ నర్సులను, ఆయాలను, వార్డ్ బాయ్ లను, ఎక్స్రే టెక్నీషియన్స్, ల్యాబ్ టెక్నీషియన్, స్కావెంజర్స్, ఆపరేషన్ టెక్నీషియన్స్ లను నియమిస్తూ మూసివేసిన అన్ని వార్డును ప్రారంభించాలని డిమాండ్ చేశారు.. సింగరేణి ఏరియా హాస్పిటల్ లో సిటీ స్కానింగ్, ఎన్ఆర్ఐ సేవలను ప్రారంభించాలని అన్నారు...

ఈ కార్యక్రమంలో బియ్యాల వెంకటస్వామి AITUC బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ , AITUC సింగరేణి  ఏరియా హాస్పిటల్ ఫిట్ సెక్రెటరీ DR శ్రీధర్,  నాయకులు బొంకూరి రామచందర్, పుల్లూరు మల్లయ్య,రత్నం ఐలయ్య, రంగ ప్రశాంత్ బ్రాంచ్ అధ్యక్షులు, సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు బొల్లం పూర్ణిమ, గుండ చంద్రమణిక్యం సిపిఐ పట్టణ కార్యదర్శి, ఆడెపు రాజమౌళి, ఎల్దుర్తి శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments