JSON Variables

ముగిసిన న్యాక్ బృందం పర్యటన

*ముగిసిన న్యాక్ బృందం పర్యటన*
న్యూస్ పవర్ రిపోట్టర్ సాయిరాం

- బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను క్షుణ్ణంగా పరిశీలించిన కమిటీ సభ్యులు
- డిపార్ట్మెంట్ల వారీగా పనితీరుపై పర్యవేక్షణ
- కళాశాల మైదానం, ప్రహరి, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్ లు, ఆట తదితర వసతుల పరిశీలన
- సంతృప్తి వ్యక్తం చేసిన త్రిసభ్య కమిటీ

*బెల్లంపల్లి:* బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల న్యాక్ బృంద పరిశీలన శుక్రవారం ముగిసింది. నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్) త్రిసభ్య కమిటీలోని చైర్పర్సన్ డాక్టర్ మురళీధర్ చందేకర్, మెంబర్ కో ఆర్డినేటర్ డాక్టర్ మహమ్మద్ యూసుఫ్ పీర్జదా, సభ్యులు డాక్టర్ ఎన్. మహదేవ్ స్వామి శుక్రవారం సాయంత్రం వరకు కళాశాలలోని వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. శుక్రవారం ఉదయం ముందుగా కళాశాల ప్రిన్సిపాల్ ఎం. గోపాల్ సమావేశ మందిరంలో భేటీ అయ్యారు. కళాశాల ఐక్యూ ఏసీ (ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్) వారు తమ విభాగపు పనితీరు, పర్యవేక్షణ గురించి బృంద సభ్యులకు క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా సభ్యులు ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ జె.వి.ఆర్ అర్చనను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. అనంతరం కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగాన్ని పరిశీలించారు. కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. కళాశాల సమీపంలోని బూదకలన్ అనే గ్రామాన్ని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో దత్తత తీసుకొని అక్కడ సాధించిన అనేక విజయాల గురించి ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్  మోహన్ బృంద సభ్యులకు వివరించారు. దీనిపట్ల సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బృంద సభ్యులు కళాశాల సైన్స్ విభాగాలను, ల్యాబ్ లను పరిశీలించారు. అనంతరం ముగ్గురు సభ్యులతో కూడిన బృందం కళాశాలలోని అన్ని డిపార్ట్మెంట్ లను పరిశీలించారు. ఆయా డిపార్టుమెంటుల రికార్డులను పరిశీలించారు.
*విభాగాల వారీగా ప్రజెంట్ స్టేషన్లు*
మధ్యాహ్న భోజనం అనంతరం న్యాక్ బృంద సభ్యులు కళాశాలలోని ఆయా డిపార్ట్మెంట్లో అధ్యాపకులు ఇచ్చిన డిపార్ట్మెంటల్ ప్రజెంటేషన్ ను పరిశీలించారు. డిపార్ట్మెంట్ల వారీగా చేపడుతున్న కార్యక్రమాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి, విద్యార్థులలో విజ్ఞానాన్ని పెంపొందించడానికి, ఫలితాలను అద్భుతంగా సాధించడానికి తీసుకుంటున్న చర్యలను స్వాగతించారు. పర్యటన ముగింపు సందర్భంగా ప్రిన్సిపాల్ వివిధ కమిటీల ఇన్చార్జిలు, అధ్యాపకులతో న్యాక్ బృంద సభ్యులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఐక్యూఏసి కోఆర్డినేటర్ జె.వి.ఆర్ అర్చన, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ టి ఎస్ ప్రవీణ్ కుమార్, ఐటీ సెక్టార్ ఇంచార్జి నవీన్ కుమార్, అకడమిక్ కోఆర్డినేటర్ శ్రీలత, పూర్వ విద్యార్థుల కమిటీ తరఫున కాంపల్లి శంకర్, మేడ తిరుపతి, డాక్టర్ కంబాల మురళీకృష్ణ, కల్చరల్ కమిటీ కన్వీనర్ రేష్మ స్పోర్ట్స్ విభాగం ఇన్చార్జి స్వామి, అధ్యాపకులు శ్రీనివాస్ తిరుపతి డాక్టర్ ఎం ఏకాంబరం రామరాజు చంద్రశేఖర్ రవి సరిత, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments