JSON Variables

బొగ్గు బ్లాకుల ప్రయివేటికరణకు వ్యతిరేకంగా జరుగు సమ్మెను కార్మికలోకం విజయవంతం చేయాలి-అఖిల భారత కార్మికసంఘాల కేంద్రం (AICTU) రాష్ట్ర ప్రధానకార్యదర్శి సబ్బని కృష్ణ పిలుపు

బొగ్గు బ్లాకుల ప్రయివేటికరణకు వ్యతిరేకంగా జరుగు సమ్మెను కార్మికలోకం విజయవంతం చేయాలి-అఖిల భారత కార్మికసంఘాల కేంద్రం (AICTU) రాష్ట్ర ప్రధానకార్యదర్శి సబ్బని కృష్ణ పిలుపు
----------------------------------------

బెల్లంపల్లి: కేంద్రప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు,కార్పోరేట్ శక్తులకు రెడ్ కార్పెట్ పరుస్తూ,కార్మిక చట్టాలను కాలరాస్తూ, ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు పరం చేయాలనే ఆలోచనలో భాగంగా 4 బొగ్గు బ్లాకులను (సత్తుపల్లి, కోయగూడెం,శ్రావణపల్లి,RK6) వేలంపాట వేస్తూ టెండర్లకు పిలవడం చూస్తావుంటే ఇది కేవలం 4 బొగ్గు బ్లాకులనే పరిమితం కాకుండా సింగరేణి వ్యాప్తంగా కోల్ బ్లాకులను ప్రయివేట్ పరం చేయాలనే దురుద్దేశ్యంతో ఈ దుస్సహాసానికి పూనుకుంటుందని,దీనిని పూర్తిగా కార్మిక సంఘాలు,కార్మికలోకం వ్యతిరేకిస్తున్నాయని,రైతు వ్యతిరేక చట్టాల రద్దుకై రైతులు సాగించిన ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకొని బొగ్గు బ్లాకుల వేలంపాటకు (ప్రయివేటికరణకు) వ్యతిరేకంగా కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఈనెల 9,10,11 తేదీలలో సింగరేణి వ్యాప్తంగా జరుగు సమ్మెలో కార్మికులంతా తమ ఐక్యతను చాటి పూర్తి స్థాయిలో పాల్గొని జయప్రదం చేయాలని
అఖిల భారత కార్మికసంఘాల కేంద్రం (AICTU) రాష్ట్ర ప్రధానకార్యదర్శి సబ్బని కృష్ణ
పిలిపునిచ్చారు..

Post a Comment

0 Comments