JSON Variables

బెల్లంపల్లి నియోజకవర్గములోని 7 మండలలలో రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జరిగిన ధర్నాలో పాల్గొన్న *బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవ డైనమిక్ MLA శ్రీ దుర్గం చిన్నయ్య గారు

*బెల్లంపల్లి నియోజకవర్గం*//-
*బెల్లంపల్లి నియోజకవర్గములోని 7  మండలలలో  రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జరిగిన ధర్నాలో పాల్గొన్న *బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవ డైనమిక్ MLA శ్రీ దుర్గం చిన్నయ్య గారు
 *నియోజకవర్గంలొ 7 మండలాల్లో ర్యాలీ నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.* 

 *ఈ సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో గౌరవ MLA శ్రీ దుర్గం చిన్నయ్య గారు మాట్లాడుతూ....* 


 *తెలంగాణ రాష్ట్ర రైతుల  మీద కక్ష కట్టిన కేంద్రం ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతాం.* 

 *కేంద్రం యాసంగి లో పంట కొనుగోలు చేయమని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి,తెలంగాణ రైతులకు నట్టేట ముంచుతుంది.* 

 *రైతులు యాసంగి లో వరి కి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసి నష్టపోకుండా ఉండాలి.* 


 *ఇప్పటికే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసింది,మరో 30 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతుల వద్ద ఉంది.కేంద్రం మాత్రం ఇప్పటి వరకు తీసుకుంది నామమాత్రమే.* 

 *బీజేపీ నేతలు ఢిల్లీలో ఒక లాగా, గల్లీలో మరోలాగా మాట్లాడుతున్నారు.తెలంగాణ రైతుల కోసం పూర్తి ధాన్యం కొనుగోలు చేసేలా ముందు కేంద్రాన్ని ఒప్పించాలి.. లేదంటే బీజేపీ కి తెలంగాణ లో స్థానం లేకుండా తెలంగాణ ప్రజలు,రైతులు చేస్తారు.* 

 *రైతులకు అండగా దేశ చరిత్రలో ధర్నా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం.* 

 *ఇప్పటికే మొదటి పంటకు ఇబ్బంది పెడుతూ,రెండవ పంట కొనమని అంటున్న బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎక్కడిక్కడ ప్రశ్నంచి నిలదిద్దాం.* 


 *తెలంగాణ లో రైతన్నకు పంట పెట్టుబడి సహాయంగా  ఎకరాకు 10 వేలు ఇస్తూ,ఏటా 14 వేల కోట్లు రైతు బంధు నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం.* 

 *ఇప్పటి వరకు 50 వేల కోట్లు రైతులకు రైతు బంధు ద్వారా అందజేయడం జరిగింది.* 

 *పంట సహాయం పై రైతు కు భరోసా తో పాటు,24 గంటల ఉచిత విద్యుత్, నాణ్యమైన విత్తనాలు,ఎరువులు అందిస్తూ,నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పిడి  యాక్ట్ పెట్టి,పంట కొనుగోలు చేస్తూ ప్రభుత్వం అండగా ఉన్నది.* 

 *అందువల్లనే నేడు తెలంగాణ లో సాగు విస్తీర్ణం పెరిగింది.తెలంగాణ రాకముందు గతంలో  5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే,ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నేడు 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది.* 


 *రాష్ట్రంలో గతంలో కోటి 40లక్షల మెట్రిక్ టన్నుల పండితే, నేడు రెండు కోట్ల 3లక్ష ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది అంటే రైతుకు ప్రభుత్వం అందిస్తున్న సంపూర్ణ సహకారం మాత్రమే అని అందరూ గుర్తు పెట్టుకోవాలి.*

*ఈ కార్యక్రమంలొ గ్రంధాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ గారు, గౌరవ ZP వైస్ చైర్మన్ శ్రీ తొంగల సత్యనారాయణ గారు, గౌరవ MPP శ్రీ గోమాస శ్రీనివాస్ గారు,గౌరవ మున్సిపాల్ చైర్మన్ జక్కుల శ్వేతా-శ్రీధర్ గారు,గౌరవ మున్సిపాల్ వైస్ చైర్మన్ శ్రీ బత్తుల సుదర్శన్ గారు,గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం కళ్యాణి-బీమాగౌడ్ గారు,గౌరవ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ మోట పలుకుల రాజశేఖర్ గారు,కౌన్సిలర్లు,7 మండలాల MPTC లు, సర్పంచ్లు ఇతర ప్రజాప్రతినిధులు అందరు పాల్గొన్నారు*

Post a Comment

0 Comments