ఎడ్లు బెదిరి ..ఎంతపనాయే.
News Power Reporter:కంసాల విజయ్‌కుమార్
బీజేపీ ఎడ్ల బండి నిరసనలో అపశృతి పలువురు నాయకుల గాయాలు.వాహనదారులకు తప్పిన ముప్పు..
సిరిసిల్ల లో పెట్రోల్ పై రాష్ట్రం జి యస్ టీ తగ్గించాలని కోరుతూ బీజేపీ అధ్వర్యంలో చేపట్టిన ఎడ్ల బండి నిరసనలో అపశృతి చోటుచేసుకుంది.ఎడ్ల బండితో ఆర్డీఓ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వైపు వస్తుండగా కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్న క్రమంలో ఎడ్లు బెదిరి బండి ఒక్కసారి లాక్కువెళ్ళడం తో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అన్నల్ దాస్ వేణు,మేకల కమలాకర్ తో పాటు కార్య కార్తకర్థలు స్వల్పంగా గాయపడ్డారు.బండి తో సహా పరుగులు పెట్టిన ఎడ్లు టౌన్ క్లబ్ వెనుక వైపు బండిని వదిలేసి పరుగులు పెట్టాయి. ఘటన లో ఓ వాహనధారున్ని ఢీ కొట్టడంతో స్వల్పంగా గాయపడ్డాడు.
0 Comments