అంతర్జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు 25000 రూ. హార్దిక సహాయం- నేనావత్ కిషన్ నాయక్
అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు పేదరికం అడ్డం వస్తుంది, డిండి మండలం చేరుకుపల్లి బురాన్ పూర్ తండాకు చెందిన కట్రావత్ గణేష్ S% రాములు మరియు రాత్ల్ వత్ రాముచందర్ S% భిచాలు జాతీయస్థాయిలో గోవాలో అండర్-17,20 విభాగంలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. నవంబర్ చివరలో నేపాల్ దేశంలో జరిగే అంతర్జాతీయ స్థాయి కబడ్డీ పోటిలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా, వారికి పేదరికం అడ్డొస్తుంది. గిరిజన కుటుంబంలో పుట్టిన నిరుపేద విద్యార్థులకు పేదరికం వెంటాడుతుంది. కబడ్డీ పోటీల్లో భాగంగా నేపాల్ దేశానికి వెళ్లడానికి రవాణా ఖర్చుల కోసం ఆర్థిక సహాయం కావాలని *నేనావత్ కిషన్ నాయక్ గారిని కోరగా వెంటనే స్పందించి వారికి 25000 రూ*.( ఇరవై అయిదు వేలు) రూపాయలను ఆర్థిక సహాయం అందించారు. ఆపన్నహస్తం అందించి దేవరకొండ ముద్దుబిడ్డ అఖిల భారత ఆదివాసి జాతీయ కాంగ్రెస్ కో-ఆర్డినేటర్ నేనావత్ కిషన్ నాయక్ గారు, దేవరకొండ నియోజకవర్గం లో సేవా కార్యక్రమాలు చేస్తూ, పేదలకు అండగా ఉంటూ అందరి మనసులో సుస్థిర స్థానం సంపాదించిన మన కిషన్ నాయక్,దేవరకొండ నియోజకవర్గంలో ఎవరికి ఎలాంటి ఆపద ఉన్నా కార్యకర్తల ద్వారా సమాచారాన్ని తెలుసుకొని, వెంటనే స్పందించి కష్టాల్లో పాలుపంచుకొని ధైర్యాన్ని నింపే గొప్ప వ్యక్తి కిషన్ నాయక్, దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎట్లాంటి ఆపద ఉన్నా నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షులు కట్రావత్ వెంకటేష్ నాయక్, మూడవత్ గోపాల్ నాయక్,గణేష్ ,రవి తదితరులు పాల్గొన్నారు.
0 Comments