JSON Variables

ఎల్లారెడ్డిపేట మండలంలో ఇద్దరికీ డెంగ్యూ లక్షణాలు

ఎల్లారెడ్డిపేట మండలంలో ఇద్దరికీ డెంగ్యూ లక్షణాలు
NEWSPOWER REPORTER:Babu
 ఎల్లారెడ్డి పేట మండలంలోని  అక్కపల్లి గ్రామంలో ఇద్దరికీ డెంగీ లక్షణాలు ఉన్నట్లు వైద్య సిబ్బంది గురువారం గుర్తించారు
వెంటనే మండల అభివృద్ధి అధికారి చిరంజీవి ,మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మ నాయక్ మరియు  వైద్య సిబ్బంది  అక్కపల్లి గ్రామాన్ని గురువారం  సందర్శించి వారి ఆరోగ్య పరిస్థతి తెలుసుకున్నారు.. జిల్లా ఎం వి బి సి పి ఆధ్వర్యంలో  దాదాపు 100 ఇళ్లక్కు పైరేత్రం (ఇండోర్)స్ప్రే చేశారు .అంతేకాకుండా డెంగీ దోమ పుట్టకుండా ఉండాలంటే ప్రతి రోజు డ్రైడే పటిష్టంగా చేపట్టాలని స్థానిక ఏఎన్ఎం కి, పంచాయతీ కార్యదర్శి మరియు ఆశ, అంగన్వాడీ కార్యకర్తల ను ఆదేశించారు. డెంగీ దోమ ఎలా తయారువుతుందో  గ్రామ మహిళలకు మరియు  యువతి యువకులకు అవగాహన కల్పించడం జరిగింది.ఇంటింటా ఫీవర్ సర్వే కూడా నిర్వహించి వారికి కావాల్సిన మందులూ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం పి ఓ వాజీర్, హెచ్ డి ఈ ఓ
 లింగము, పి హెచ్ ఎన్  ప్రమీల మరియు గ్రామ సిబ్బది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments