JSON Variables

వింజపల్లి లో బతుకమ్మ చీరల పంపిణీ

వింజపల్లి లో బతుకమ్మ చీరల పంపిణీ..
     ఈరోజు కోహెడ మండలం వింజపల్లి గ్రామంలో కోహెడ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) గారు ముఖ్య అతిథిగా విచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని గౌరవ గ్రామ సర్పంచ్ శ్రీ బద్దం తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంపిడివో గారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.

   సర్పంచ్ గారు మాట్లాడుతూ బతుకమ్మ అంటేనే మన తెలంగాణ ఆడపడుచుల పండుగ, తెలంగాణ పండుగ. ఇట్టి పండుగను ఘనంగా జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం మరియు కేసీఆర్ గారు మన ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు మన గ్రామ ఆడపడుచులకు చీరలను పంపించడం చాలా ఆనందం. వారికి నా కృతజ్ఞతలు.. బతుకమ్మను ప్రతి ఒక్కరు అనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నా..
     ఇట్టి కార్యక్రమంలో ఎంపీటీసీ ద్యాగటి సురేందర్, ఉపసర్పంచ్ అక్కరవేని సాహితీ రాజు, కార్యదర్శి సుధీర్, వార్డ్ సభ్యులు దూలం నారాయణ, బోనగిరి శంకర్, అన్నాడి సత్యనారాయణ రెడ్డి, గర్రెపల్లి సదానందం మరియు కోఆప్షన్ సభ్యులు నంగునూరి లావణ్య, కారోబార్ బొమ్మడవేని అంజనేయులు, గ్రామ విఓ లు, గ్రామ అంగన్వాడీ టీచర్ లు, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..

Post a Comment

0 Comments