హై వోల్టేజ్ తో భారీ నష్టం
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో హై వోల్టేజ్ తో భారీ నష్టం వాటిల్లిందని 1,2 వ వార్డులలో టీవీలు, ఫ్రిజ్లు కాళి పోయాయని గృహిణిలు ఆరోపించారు. శుక్రవారం 10 గంటలకు హై వోల్టేజ్ కరెంటు ఒక్కసారిగా రావడంతో టీవీలు ఫ్రిజ్లు కాలిపోయి పొగలు రావడం వలన గృహాలలో ఉన్న గృహిణిలు బయటకు పరుగులు తీశారు. టీవీ లో నుండి మంటలు చెలరేగాయని భయభ్రాంతులకు గురయ్యారు. దీనికి కారణం విద్యుత్తు ఎక్కువ రావడం వల్లనే అని వారు వాపోయారు. దీంతో సుమారు 15 టీవీలు, 10 ఫ్రిడ్జ్లు, 15 సీలింగ్ ఫ్యాన్లు, వాటర్ ప్యూరిఫైయర్లు, టీవీ సెటప్ బాక్స్ లు, సెల్ ఫోన్ చార్జర్ దగ్ధం కాగా భారీ నష్టం వాటిల్లిందని మహిళలు లబోదిబోమంటున్నారు. దీనిపై సెస్ ఏ ఈ దివ్య ని వివరణ కోరగా... విద్యుత్ తీగలపై కోతులు వేలాడడం తో ఫేసు, న్యూట్రల్ జాయింట్ అవ్వడం వలన దగ్గర్లో ఉన్న ఫ్రిడ్జ్లు, టీవీలు కాలిపోయాయి అని వివరించారు. దీనిపై పై అధికారులకు నివేదిక పంపమని వెల్లడించారు.
0 Comments