రామ్ నాథ్, నరేంద్ర మోడీ చిత్రపటాలు బహూకరణ
ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు కృష్ణ హరి ఆధ్వర్యంలో భారత రాష్ట్రపతి రామ్నాథ్ గోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాలను గ్రామ పంచాయతీ కార్యదర్శి కి బుధవారం బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం వ్యాక్సిన్ పంపిణీలో ప్రపంచంలో రెండవ స్థానంలో నిలిచిందని దీనికి కారణం భారత ప్రధాని నరేంద్ర మోడీ వల్లనే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు రవీందర్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి జితేందర్, మండల ఓబిసి ప్రధాన కార్యదర్శి సతీష్, బీజేవైఎం అధ్యక్షులు సతీష్ తదితర నాయకులు పాల్గొన్నారు.
0 Comments