JSON Variables

ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో పంట మార్పిడిపై రైతులు మరియు గ్రామస్థులతో చర్చించిన తోట ఆగన్న.

ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో పంట మార్పిడిపై రైతులు మరియు గ్రామస్థులతో చర్చించిన తోట  ఆగన్న.

రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం వరి పంటను సేకరించేది లేదని ఆదేశాలు జారీచేయడం వలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యగా రాష్ట్ర మంతటా పంట మార్పిడిని ప్రోత్సహిస్తున్నది.
ఈరోజు సింగారం గ్రామంలో గ్రామ పాలకవర్గం మరియు రైతులు ,గ్రామస్థుల సమక్షంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీ.ఆర్.ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల ఇంచార్జ్ తోట ఆగన్న మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులంతా కలిసి ఒక కమిటీని ఏర్పరచుకొని పంటమార్పిడిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారికి ప్రభుత్వం నుంచి అవసరమైన మద్దతు అందిస్తామని అంకాపూర్, ముల్కనూరు,గంగదేవిపల్లి వంటి గ్రామాలను ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి పథంలో కొనసాగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షులు రాదరపు శంకర్,ఏ.ఎమ్.సి ఛైర్మన్ కొండ రమేష్, వ్యవసాయ శాఖ ఏఈవో అనూష, నర్సాగౌడ్,ఉపసర్పంచ్ ఉస్మాన్, గ్రామ పాలకవర్గంసభ్యులు, ఎంపిటిసి మధు,మండల యూత్ అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్, ఏ.ఎం.సి డైరెక్టర్ దేవరాజు,గ్రామ శాఖ దేవరాజు,శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments