గిరిజన బాలిక కుటుంబానికి అండగా ఉంటాం.టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ బస్వరాజు సారయ్య...

గిరిజన బాలిక కుటుంబానికి  అండగా ఉంటాం.
NEWSPOWWR REPORTER:Babu
 అత్యాచారానికి పాల్పడిన శంకర్ ను టిఆర్ఎస్  పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి రైతు సమన్వయ సమితి పదవి నుంచి సస్పెండ్ చేస్తున్నాం..
 టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఉమ్మడి జిల్లాల   ఇంచార్జ్ బస్వరాజు సారయ్య...
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామంలో గిరిజన బాలికపై అత్యాచారానికి బాధ్యుడైన  శంకర్ ను మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి,  రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బస్వరాజు సారయ్య శనివారం ప్రకటించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని క్యాంప్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బస్వరాజు సారయ్య మాట్లాడుతూ..  గిరిజన బాలికల కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన భరోసా కల్పించారు  అల్మాస్ పూర్ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. కలెక్టర్, పోలీస్ అధికారులను కలిసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందని ఆయన తెలిపారు.బాధకరమైన సంఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేయడం సరికాదన్నారు. అనంతరం జెడ్పి చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని,ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు.ప్రభుత్వపరంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో జిల్లా టిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ ఆగయ్య, వీర్నపల్లి జడ్పిటిసి కళావతి, మున్సిపల్ చైర్ పర్సన్ చంద్ర కళ, సిరిసిల్ల టౌన్ ప్రెసిడెంట్ ఛక్రపాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ శంకరయ్య, ఎల్లారెడ్డి పేట ఎంపీపీ రేణుక, వైస్ ఎంపీపీ కదిరి భాస్కర్, కోనరావుపేట ఎంపీపీ చంద్ర,  ఎల్లారెడ్డిపేట టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణ హరి, పి ఎస్ సి ఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఏఎంసి చైర్మన్ రమేష్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బండారి బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments