నల్లబ్యాడ్జీలు ధరించి వినతి పత్రం

నల్లబ్యాడ్జీలు ధరించి వినతి పత్రం 
బొల్లం సాయిరెడ్డి
మానకొండూరు నియోజకవర్గం ఈరోజు బెజ్జంకి మండల కేంద్రంలో నీ మహాత్మా గాంధీ నీ ఈ విగ్రహానికి బిజెపి బెజ్జంకి మండల అధ్యక్షులు దోనె అశోక్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి వినతి పత్రం సమర్పించడం జరిగింది.
అనంతరం మండల అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ
దేశం లో ఎక్కడ జరగనటువంటి విషయం, ఎలాగైనా హుజురాబాద్ లో గెలవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వీ వీ ప్యాట్.లను మరియు ఇవిఎం మీషన్లను తారుమారు చేసే ప్రయత్నంలో భాగంగా ప్రయివేటు వాహనాల్లో సెక్యూరిటీ లేకుండా తరలించడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. స్వాతంత్రం వచ్చిన తరువాత దేశంలో ఎన్నో ఎలక్షన్లు జరిగినప్పటికీ హుజురాబాద్ లో అధికార పార్టీ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా విచ్చలవిడిగాడబ్బులు మరియు మద్యం పంచటం జరిగినప్పటికీ ఓటర్ల మనసును గెలవలేకపోయింది. ఎలాగైనా హుజురాబాద్ లో గెలుపొందలనే ఉద్దేశంతో ఈవీఎం మిషన్లను మార్చే ప్రయత్నం కూడా చేశారు, అధికార పార్టీ తీరును అలాగే ఎలక్షన్ కమిషన్ యొక్క వ్యవహారమును చూసి  యావత్ దేశం అంతా కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు సిగ్గు పడండి ఒక్క గెలుపు కోసం ఇంతలా దిగజారి ప్రజాస్వామ్యం పైన ప్రజల నమ్మకాన్ని పోగొట్టకుడదు అని హెచ్చరించారు.
ఇట్టి కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దొంతరవేణి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు సంగ రవి, శీలం వెంకటేశం, కొండల వెంకటేశం, బండిపల్లి శ్రీనివాస్, అడుకని వీరేశం, సందీప్ , ఇస్కిల్ల సాగర్, బోనగం శంకర్, బండి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments