రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం కాంగ్రెస్ నియెాజక వర్గ యువ నేత బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్


రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం  కాంగ్రెస్ నియెాజక వర్గ యువ నేత బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్
NEWSPOWER REPORTER:ఆర్ బి చారి
 ఈ రోజు సిద్దిపెట్ జిల్లా హుస్నాబాద్ నియెాజక వర్గం కోహెడ మండలం శనిగరం గ్రామంలో  పాత్రికేయ సమావేశంలో కాంగ్రెస్ నియెాజక వర్గ యువ నేత బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రబీ సీజన్ కి సంబంధించి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి వరి పంటకి సంబంధించి డీలర్లు ఎవరూ కూడా వరి విత్తనాలు ఎట్టిపరిస్థతుల్లోనూ అమ్మొద్దని వ్యవసాయ శాఖ అధికారులను మరియు డీలర్లను హెచ్చరిస్తూ, ఒకవేళ ఎవరైనా అమ్మినట్టు తెలిస్తే వ్యవసాయ శాఖ అధికారులను సస్పెండ్ చేస్తానని డీలర్ల లైసెన్సులను రద్దు చేస్తానని చెప్పడం జిల్లా కలెక్టర్ వెంకట్ రాం రెడ్డి గారు కలేక్టర్ స్దానంలో ఉండి  బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను 
రైతులకు వారి పొలాల్లో ఏపంటలు పండించాలో తెలుసని రబీ సీజన్లో బరాబర్ వరి పంట వేస్తారని అడ్డుకున్న అధికారులను అయినా ప్రజా ప్రతినిధులను అయినా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ బి.సి.సంక్షేమ సంఘం పక్షాన ఎండగడతామని  హెచ్చరించారు
ఉదాహరణకు శనిగరం గ్రామం మెుట్ట ప్రాంతం రైతులు అందరూ వరి తప్ప వెరె ఎ పంట పండే పరిస్దితి లెదు అలాంటపుడు ఇక్కడ రైతులు ఎం చేయాలి బిచ్చం ఎత్తుకోవాలన్నారు 
కేంద్రాన్ని బూచి చూపుతున్నావు కదా కేంద్రం పై యుద్దం ప్రకటించు మీతో కలిసి మెము కూడా పోరాడతాము శ్రీనివాస్ గౌడ్ అన్నారు 
రబీ సీజన్ లో వరి పంట విషయంలో సి.ఎం.కే.సి.ఆర్.
పునరాఆలోచణ చేయాలి అని అన్నారు 
కోంతమంది ప్రభుత్వ అధికారులు నీకు బానిసగా వ్యవహరిస్తారు కావచ్చు కాని రైతులు ఎవ్వరు నీకు బానిసలు  కాదు లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం జలాలు ఎందుకోసం తెచ్చారని అన్నారు 
వరి విషయంలో పునరాఆలోచన చేయకపోతే రైతులే నీకు నీ ప్రభుత్వానికి రాబోయె రోజుల్లో  బుద్ది చేబుతారన్నారు 
రైతుల పక్షాన కోట్లాడడానికి రైతు బిడ్డగా కాంగ్రెస్ పార్టీ బి.సి.సంక్షేమ సంఘం పక్షాన ముందుంటామని తెలియజేశారు 
ఈ కార్యక్రమంలో బి.సి.సంక్షేమ  సంఘం శనిగరం గ్రామ గౌరవ అద్యక్షుడు టాకూర్ మహెందర్ సింగ్ ,అద్యక్షుడు సింగిరాల శ్రీనివాస్,  కార్యదర్శి సింగిరాల కుమారస్వామినాయి,యూత్ ప్రెసిడెంట్ బౌరోజు జగదీశ్వరా చారి,వైస్ ప్రెసిడెంట్ జడగల పవన్,కాశవేని శ్రీనివాస్,బోడిగే శ్రీనివాస్ ,జేరిపోతుల కార్తిక్ ,రాజ్ కూమార్ మరియు కాంగ్రెస్ బి.సి.సంక్షేమ సంఘం నాయకులు పాల్గోన్నారు

Post a Comment

0 Comments