మైనర్ బాలికపై అత్యాచారయత్నం
మైనర్ బాలికపై అత్యాచారానికు యత్నించిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలం ఆల్మాస్ పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. అల్మాస్ పూర్ గ్రామానికి చెందిన గూగుల్ లోతు హిరమన్, నిర్మల దంపతులకు చెందిన మైనర్ బాలిక అత్యాచారనికి గురైందని తల్లిదండ్రులు ఆరోపించారు. నిందితుడిని వెంటనే శిక్షించాలని ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ సమీపంలో గిరిజనులు, తల్లిదండ్రులు రెండు గంటల సేపు ధర్నా రాస్తారోకో నిర్వహించారు.
నిందితుడిని వెంటనే శిక్షించాలి: కాంగ్రెస్ పార్టీ
ఎల్లారెడ్డిపేట మండలం ఆల్మాస్ పూర్ గ్రామ సర్పంచ్ భర్త రాధారపు శంకర్ నీ వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సయ్య డిమాండ్ చేసారు. అల్మాస్ పూర్ గ్రామంలో పాశవికంగా గా ఆరు సంవత్సరాల పాప ను అత్యాచారం చేయడం బాధాకరమన్నారు. ఈయన ఎల్లారెడ్డిపేట మండల సమన్వయ సమితి మండల అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నాడు. ఒక అధికార పార్టీ నేత కూడా ఒక గిరిజన బాలిక అని చూడకుండా అత్యాచారం చేయడం బాధాకరమని అన్నారు. ఇలాంటివారిని త్వరితగతిన చట్టం ప్రకారం శిక్ష విధించాలన్నారు.
గిరిజన బిడ్డకు న్యాయం జరగకపోతే ఉద్యమిస్తాం: రెడ్డ బోయిన గోపి
గిరిజన బిడ్డకు న్యాయం జరగకపోతే ఉద్యమిస్తామని బిజెపి జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డ బోయిన గోపి డిమాండ్ చేశారు.
సర్వ సభ్య సమాజం తలదించుకునే వలసిన పరిస్థితి ఎదురైందనీ అని అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం ఆల్మాస్ పూర్ గ్రామ సర్పంచ్ భర్త అధికార పార్టీ సర్పంచ్ గిరిజన అమ్మాయి ఆరు సంవత్సరాల వయసు అత్యాచార ప్రయత్నం చేయడం చాలా బాధాకరంమనీ, అధికార పార్టీ సర్పంచ్ ని చట్టప్రకారం ప్రభుత్వం శిక్షిస్తాదా లేదా తప్పిస్తద అని అన్నారు. గిరిజ నా బిడ్డకు న్యాయం జరగకుంటే ఉద్యమిస్తామని న్యాయం జరిగేలా పోరాడతామని అన్నారు.
అనంతరం డిఎస్పీ చంద్రశేఖర్ నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీతో నిరసనలు శాంతింపజేశారు.
0 Comments