JSON Variables

పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ శ్రేణులు ధర్నా...

NEWSPOWER REPORTER:Dileep
 డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ శ్రేణులు ధర్నా........రాజన్న సిరిసిల్ల జిల్లా  ముస్తాబాద్ మండల కేంద్రంలో  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్ల బాల్ రెడ్డి  ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ మరియు వంట గ్యాస్ ధరలు తగ్గించాలని  కోరుతూ రాజీవ్ చౌక్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది 2012 సంవత్సరంలో యుపిఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతర్జాతీయంగా ఒక క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $140 ఉండేది అప్పుడు  పెట్రోల్ 60 రూపాయలు డిజిల్ 50 రూపాయలు వంట గ్యాస్ ధర 390 రూపాయలు ఉండేది మరి బిజెపి 2014లో ఎన్నికలకు వచ్చినప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రణలో ఉంచుతామని చెప్పి దినదినము పెంచుకుంటూ పోతుంది గత తొమ్మిది నెలల్లో గ్యాస్ సిలిండర్ పై రెండు వందల రూపాయలు పెట్రోల్ డీజిల్ 63% ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుంది పెట్రోల్ డీజిల్ ధరలను జిఎస్టి లోకి తీసుకు వస్తాము కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవడం  లేదు అని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చెబుతున్నారు భారతదేశంలో ఇరవై రాష్ట్రాలు బిజెపి ప్రభుత్వం లు ఉన్నవి మీరు అనుకుంటే తగ్గించవచ్చు అబద్ధపు మాటలు ఎందుకు చెప్తా ఉన్నారు 20 20 సంవత్సరంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్  బ్యారెల్ ధర ఇరవై డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు తగ్గించలేదు ఈ రోజున అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 77 డాలర్లు ఉంది పెట్రోల్ 112 డిజిల్ 105 వంటగ్యాస్ వెయ్యి చేరువైంది అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే ఇక్కడ భారతదేశంలో ఆయిల్ ధరలు తగ్గించడం లేదు ఈ ప్రభుత్వం అంతర్జాతీయంగా ధరలు పెరిగితే మాత్రం పెంచుకుంటూ పోతుంది గత 25 రోజుల నుంచి ప్రతిరోజు 30 పైసల చొప్పున పెంచుకుంటూ పోతూ ప్రజల నడ్డి విరుస్తుంది  డీజిల్ ధరల పెంపకం వల్ల నిత్యావసర సరుకులు ఆకాశాన్నంటుతున్నాయి భారతదేశంలో ఇంతవరకూ పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలు ఈ స్థాయికి ఎప్పుడూ చేరలేదు వెంటనే పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ తగ్గించాలని డిమాండ్ చేశారు  ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు, జిల్లా కార్యదర్శులు కొండం రాజు రెడ్డి,బుగ్గ రమేష్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ద గారి శ్రీనివాస్, ముస్తాబాద్ ఎం పి టి సి గుండెల్లి శ్రీనివాస్,మాజీ ఎంపిటిసి గజ్జలరాజు, సీనియర్ నాయకులు రామ్ రెడ్డి ,నమ పూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు మా దాస్ అనిల్, గ్రామ శాఖ అధ్యక్షులు రాజ్ కిరణ్, నాయకులు ఆరుట్ల మహేష్, తుపాకుల శ్రీనివాస్ గౌడ్, డి టి నర్సింలు ఆల్మస్పోర్ బాల్రెడ్డి, రంజాని నరేష్ ,సారు గు రాకేష్ ,తాళ విజయ్ ,ఏ దండి మహేష్ ,పోతారం నవీన్ ,ఎదు నూరి భాను ,శీల ప్రశాంత్ ,వార్డు సభ్యులు వెంకటేష్ ,మద్దికుంట రాజం , తలారి నర్సింలు ,మాధురి కిషన్, కొండయ్య ,చింతల మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments