గంజాయి సాగుపై డ్రోన్ కెమెరాలతో నిఘా

*గంజాయి సాగుపై డ్రోన్ కెమెరాలతో నిఘా*

మంచిర్యాల సబ్ డివిజన్ పరిధిలో గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎసిపి అఖిల్ మహాజన్ తెలిపారు. అటవీ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో గంజాయి గుర్తించనున్నట్లు వెల్లడించారు. గంజాయి సాగు, అక్రమ రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేసి పిడియాక్ట్ నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. గంజాయి దందా నిర్వహిస్తున్న వారి సమాచారం అందించి ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన తెలిపారు. గంజాయి తాగడం ఎక్కువ మంది ఉద్యోగులు, చదువుకున్న వారే ఉన్నారని, ఒకసారి గంజాయి సంబంధిత కేసు నమోదైతేతే జీవితంలో ఏలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు రావని ఎసిపి పేర్కొన్నారు.


Post a Comment

0 Comments