JSON Variables

చెగువేరా స్ఫూర్తితో నేటితరం వైద్యులు ఉచిత వైద్యం అందించాలి

చెగువేరా స్ఫూర్తితో నేటితరం వైద్యులు ఉచిత వైద్యం అందించాలి.
డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య అందించి జిల్లాకొక  ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి  ప్రైవేట్ మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని నిరుపేద విద్యార్థులకు ఉచిత  వైద్యవిద్య అందించినట్లయితే దేశంలో రాష్ట్రంలో పేద రోగులకు ఉచిత వైద్యం అందించాలని తిరుపతి ప్రభుత్వాలను డిమాండ్.

స్థానిక జిల్లా కార్యాలయంలో చేగువేరా 54 వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం చేగువేరా చిత్రపటానికి తిరుపతి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేష్ పటెల్ తిరుపతి మాట్లాడుతూ అమెరికాలాంటి సామ్రాజ్య వాదుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిన గొప్ప విప్లవ వీరుడు చే గువేరా అని వారు అన్నారు.చేగువేరా ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా వైద్యం అందించి పేద రోగులకు కాపాడిన ఘనత చేగువేరా అని అన్నారు. పేద రోగులకు ఉచిత వైద్యం అందించడంలో ముందు వరుసలో నిలబడి వైద్యం అందించారని వారు అన్నారు. నేడు దేశంలో కరోనా మహమ్మారి తో పూర్తిస్థాయిలో వైద్యులు అందుబాటులో లేకపోవడం లక్షల సంఖ్యలో పేద రోగులకు సరైన సమయానికి వైద్యం అందించగా ప్రాణాలు కోల్పోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద విద్యార్థులకు దేశంలో ఉచిత వైద్యం అందించినట్లయితే రోగులు ఆర్థికంగా నష్టపోకుండా ప్రాణాలు కాపాడుకుంటారని  అన్నారు.నేడు దేశంలో రాష్ట్రంలో చుసినట్లయితే ప్రైవేట్ మెడికల్ కళాశాల యాజమాన్యాలు కోట్లలో ఫీజులు వసూలు చేయడం వల్ల పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించ కుంట నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు ఆవేదన వ్యక్తం చేశారు . నాడు చేగువేరా కృషితో క్యూబా లో ఉచిత వైద్య విద్యను పేద విద్యార్థుల అందించడం వల్ల కరోనా మహమ్మారి అరికట్టారని వారు అన్నారు. నేడు దేశంలో పూర్తిస్థాయిలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయకుండా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాల కు తొత్తుగా వ్యవహరిస్తూ నేడు పేద రోగులకు ఉచిత వైద్యం అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యారని వారు విమర్శించారు.నేటితరం వైద్యులు డబ్బులు సంపాదించాలని కోణంలో ఆలోచించకుండా సేవా దృక్పథంతో ఉచిత వైద్యం అందించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేద విద్యార్థులకు ఉచిత వైద్యవిద్యను  అందించి ప్రజలకు ఉచిత వైద్యం అందించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రవీంద్రనాయక్ ప్రశాంత్ శ్రీను లక్ష్మణ్ రాజేందర్ ఉపేందర్ రమేష్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments