JSON Variables

అనాధ పిల్లలకు ఆర్థిక సహాయం అందజేసిన పెద్దలింగాపూర్ సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్

అనాధ పిల్లలకు ఆర్థిక సహాయం అందజేసిన పెద్దలింగాపూర్ సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్
NEWSPOWER REPORTER:Saireddy
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామ సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్ పండగ పూట బతుకమ్మ దసరా సంధర్భంగా అనాధలు  దిగులుపడుకుండా నేను వున్నానంటు గ్రామానికి చెందిన వారు వివిధ కారణాలతో అనారోగ్యంతో చిన్న తంలోనే తల్లి తండ్రులను  కొంతమంది తల్లిని కొంత మంది తండ్రిని కోల్పోయి  ఆనాధలైన పిల్లలను హక్కున చేర్చుకొని  ఈ రోజు 11 మందికి తల ఒకంటికి 1,000/- రూపాయల చొప్పున 11,000/- వేల రూపాయలు అందజేశారు.
జితెందర్ గౌడ్ మాట్లాడుతూ తల్లిదండ్రులను కోల్పోయిన ఆ పిల్లల భవిష్యత్తు కోసం భరోసా ఇస్తున్నాను..వారికి ఏ అవసరం ఉన్న నా దృష్టికి తీసుకరండి నా వంతు సహాయ సహాకారాలు అందిస్తానని అన్నారు.వారికి పోయిన సంవత్సరం కూడా ఇవ్వడం జరిగిందని వారికి ప్రతి ఏటా ఇస్తానని అన్నారు.
ప్రతి సంవత్సరం అనాధ పిల్లలకు హార్థిక సహాయం అందజేస్తున్న సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్ ను పెద్దలింగాపుర్ గ్రామస్థులు అభినందించారు..

Post a Comment

0 Comments