గంజాయి సాగు పై నిత్యం పర్యవేక్షణ
సాగు చేసినా, సేవించినా కఠిన చర్యలు తప్పవు
సాగు చేసిన వారి, సేవించిన వారి వివరాలు తెలిపితే పారితోషికం బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్
కొమటిచేనులో డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ
గంజాయి సాగు చేసినా, సేవించినా
కఠిన చర్యలు తప్పవని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ హెచ్చరించారు.
ఆదివారం కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కోమటిచేను గ్రామ శివారులో గంజాయి సాగు చేస్తున్నారా అనే విషయంతో పాటు గంజాయి సేవిస్తున్నారా అనే విషయంపై పర్యవేక్షణ కోసం డ్రోన్ కెమెరాలతో పరిసరాలు మొత్తo పరిశీలించారు.
ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ మాట్లాడుతూ ఎవరు కూడా గంజాయి ని సాగు చేసిన, సేవించిన వారి పై చట్ట రిత్య తగిన చర్య తీసుకుంటామన్నారు.
పట్టా భూమిలో గంజాయి సాగు చేస్తే రైతు బంధు రద్దు చేయడం జరుగుతుందని, అసైండ్ భూముల్లో సాగు చేస్తే అట్టి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వివరించారు.
సాగు చేసిన వారి వివరాలు, సేవించిన వివరాలు తెలిపిన వారి వివరాలు గొప్యంగా ఉంచడంతో పాటు సమాచారం అందించిన వారికి పారితోషికం అందిస్తామన్నారు.
యువత గంజాయి, మత్తు పదార్థాలు సేవించి తమ విలువైన భవిష్యత్తు నాశనము చేసుకోవద్దని హెచ్చరిస్తూ ఎవరైనా గంజాయి ని సేవినట్లు తెలిసిన మాకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
తల్లి తండ్రులు యువత పట్ల జాగ్రత్తగా ఉండాలని మత్తు పదార్థాలు, చెడూ వైపు వెళ్లకుండా చూసుకోవాలన్నారు.
రైతులు పంటలో గంజాయి మొక్కలు పెంచి ఇబ్బందులు పడవద్ధన్నారు. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు
ఈ సమావేశంలో మందమర్రి సీఐ ప్రమోద్ రావు. కాసిపేట ఎస్ఐ కళ్యాణం నరేష్, దేవాపూర్ ఎస్ఐ విజయేoదర్ పాల్గొన్నారు.
0 Comments