అనారోగ్య బాధిత బాలుడికి బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆర్థికసాయం



అనారోగ్య బాధిత బాలుడికి బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆర్థికసాయం
NEWSPOWER REPORTER:Sairam< b>
 కాలేయ సంబంధిత వ్యాధి మరియు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న బాలుడికి ఆదివారం బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్టు సభ్యులు రూ.10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరి శంకర్ తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నంబాల గ్రామానికి చెందిన వి. సాగర్ గౌడ్ కుమారుడు సుహాన్ కొంతకాలంగా కాలేయ మరియు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు. ఈ అనారోగ్య సమస్యకు సంబంధించిన వైద్యాన్ని బాలుడి తల్లిదండ్రులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో వారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాయిజమ్మ సాయి సేవా ట్రస్టు వారు తమ సభ్యులతో చర్చించి రూ. 10 వేల ఆర్థిక నగదును దాతల సహకారంతో  ఆదివారం నంబాల గ్రామానికి వెళ్లి బాలుడి కుటుంబానికి అందజేశారు. బాయిజమ్మ సాయి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు వివిధ సమస్యలతో బాధపడుతున్న వారికి వీలైనంత సహాయం అందిస్తున్నట్లు వ్యవస్థాపకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు మేనేజర్ బొద్దున సతీష్, కోశాధికారి జక్కం నాగమణి, సభ్యులు, సేవకులు పాల్గొన్నారు.

Post a Comment

1 Comments

  1. Good work every people help publish this guy father account details ........any flat from .....

    ReplyDelete